TRS | ఆదరిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా

TRS | ఆదరిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా


TRS | ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి గ్రామపంచాయతీ ఒకటో వార్డు అభ్యర్థిగా పుష్పాల సాయి టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ.. నన్ను వార్డు మెంబర్ గా గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రధానంగా ములకలపల్లి గ్రామపంచాయతీలో కోతుల సమస్యకు గెలిచిన వెంటనే పరిష్కారం చూపుతాను అన్నారు. వాటిని నిర్మూలనకు కావలసిన పరికరాలు తినుబండారాలు తన సొంత డబ్బుతో కొనడానికి నేను సిద్ధంగా ఉన్నానని.. అంతేకాక నా వార్డుతో పాటు అన్ని వార్డులకు మా వంతు సహకారం సహాయ సహకారం అందిస్తానని ప్రజలకు మాట ఇస్తున్నాను అన్నారు.

గత గ్రామపంచాయతీ ఎన్నికలలో నాన్న పుష్పాల చందర్రావు ఇదే వార్డ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఒకటో వార్డును సీసీ రోడ్లు తాగునీటి సమస్యలను పరిష్కారం చూపారు. నిత్యం ప్రజలతో మమేకమై వార్డు ప్రజలకు నేనున్నానని నిరూపించుకున్నారని.. ములకలపల్లి గ్రామపంచాయతీ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గం చూపించి నిజాయితీపరుడుగా పేరు తెచ్చుకున్నారు అని అన్నారు. తను కూడా ఆయన అడుగుజాడలో నడిచి తండ్రికి తగ్గ తనయుడుగా ఒకటో వార్డు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వార్డు ప్రజలకు నాన్న తరపున వాగ్దానం చేస్తున్నాను అని పేర్కొన్నారు.

Leave a Reply