TP | అభ్యర్థుల వినూత్న ప్రచారం

TP | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఎన్నికల్లోనైనా అభ్యర్థులు వేరువేరుగా ప్రచారం చేస్తారు. వారి అభిమానులతో కలిసి ప్రచారం(campaign) చేయడం సహజం కానీ అదిలాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొత్తగూడ (జి) పంచాయతీలోని గుండు పంచాయతీలోని గోండుగూలో ఆ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు బానోత్ సంగీత జైవంత్ రావు, భీంబాయి సుమన్ శనివారం రాత్రి వారి ఇంటికి వెళ్లి మీ ఓటు నాకేయాలని ఒకరికొక అభ్యర్థిని అభ్యర్థించుకున్నారు. ప్రజలు ఎవరికి ఓటు వేసి గెలిపించిన పంచాయతీ ప్రజలు ఎవరికి ఓటు వేసి గెలిపించినా పంచాయతీ అభివృద్ధికి కృషి చేద్దామని నవ్వుకుంటూ ఒకరికొకరు ముచ్చటించుకున్నారు.

ఇద్దరు మహిళ అభ్యర్థులు తమ భర్తలతో కలిసి వారి గుర్తు బ్యాలెట్ పేపర్లను పంచుకున్నారు. అభ్యర్థుల కలయికతో ఆ గ్రామస్తులు అవ్వక్కయ్యారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ గెలుపు కోసం వేరువేరుగా ప్రచారం చేయాల్సి ఉండగా ఆ గ్రామంలో అభ్యర్థులు కలిసి ప్రచారం చేయడం విశేషం. అభ్యర్థులు ఉదయం రాత్రి వేళల్లోనే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నా రు. తమదైన శైలిలో హామీలు ఇస్తూ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు.

Leave a Reply