Commissioner | శ్రీతిరుపతమ్మ ఆలయం

Commissioner | శ్రీతిరుపతమ్మ ఆలయం


ఉప కమిషనర్ గా బి.మహేశ్వరరెడ్డి
Commissioner | పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : పెనుగంచిప్రోలులోని శ్రీతిరుపతమ్మ అమ్మవారి దేవాలయం ఉప కమిషనర్ గా బి.మహేశ్వరరెడ్డి (B. Maheshwara Reddy) నియమితులయ్యారు. గురువారం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఉద్యోగులు స్వాగతం పలకగా.. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కార్యాలయంలో ఆలయ ఉప కమిషనర్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆయన దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు.

రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. దీనిలో భక్తులకు (Devotees) మెరుగైన సేవలందించడంలో ఉపకమిషనర్ స్థాయి కలిగిన 14 ముఖ్య ఆలయాల్లో పెనుగంచిప్రోలు భక్తుల సంతృప్తి స్థాయిలో 52.7 శాతంతో చివరి స్థానంలో ఉంది. దీనిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్ లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ (Ramachandra Mohan) ఆలయాల ఈవోలతో సమీక్షించారు. భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పెనుగంచిప్రోలు ఆలయ ఈవో కిశోరుమార్ ను వెంటనే తొలగించాలని, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వొద్దని ఆదేశించారు. దీంతో బుధవారం రాత్రికే మూడు నెలల దీర్ఘకాలిక సెలవుపై ఈవో కిశోర్ కుమార్ వెళ్లిపోయారు. ఆ స్థానంలో మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

Leave a Reply