AP | మద్యం హోమ్ డెలివరీ..
AP | మద్యం హోమ్ డెలివరీ..
AP, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎక్సైజ్ మంత్రి ఇలాకా అయిన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో బెల్టు షాపులు రోజురోజుకీ అడ్డదారులు తొక్కుతూ బహిరంగంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ షాపులకు మద్యం నేరుగా హోమ్ డెలివరీ అవుతోంది. సరఫరా చేస్తున్న బాటిళ్ల పై లేబుళ్లు, సీల్ వివరాలు లేకపోవడంతో ఇది అసలైన మద్యమా.? లేకా నకిలీ మద్యమా..? అనే అనుమానాలు ప్రజల్లో మరింతగా పెరుగుతున్నాయి. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. బెల్టు తీస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) చెప్పినప్పటికీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ డోర్ డెలివరీకి సైతం తెగబడుతున్నారు.
