Chandrababu | అన్న క్యాంటీన్లో..
Chandrababu | అన్న క్యాంటీన్లో..
- 5 రూపాయలకే నాణ్యమైన ఆహారం..
- అన్న క్యాంటీన్ సందర్శించిన ఎమ్మెల్యే అమిలినేని..
Chandrababu, అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడు కడుపునిండా భోజనం చేయాలనే సంకల్పంతో కూటమి (Kutami) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి నాణ్యమైన భోజనం అందిస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు.
అధికారులు స్థానిక నాయకులతో కలసి అన్న క్యాంటీన్ ను (Anna canteen) ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సందర్శించారు. అక్కడ టిఫిన్ చేస్తున్న వారిని పలకరించి టిఫిన్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. అధికారులు, టీడీపీ నాయకులు అన్న క్యాంటీన్ లో టిఫిన్ చేస్తున్న వారితో పాటు అక్కడే టిఫిన్ చేశారు.
