Central Zone | న్యాయంపై ప్రజల్లో భరోసా కలిగించాలి
Central Zone | న్యాయంపై ప్రజల్లో భరోసా కలిగించాలి
Central Zone | పోలీసుల గౌరవాన్ని పెంపొందించండి
Central Zone | వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
Central Zone | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : పోలీస్ స్టేషన్కు వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ ప్రాంగణాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్(Police Commissioner Sunpreet Singh) ఈ రోజజు ప్రారంభించారు.
ఠాణాకు చేరుకున్న సీపీకి పోలీస్ అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను నిశితంగా పరిశీలించారు.
Central Zone | నిజాయితీ, నిబద్ధతతో పని చేయండి
ఈసందర్బంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… పోలీస్ శాఖకు గౌరవమర్యాదలు తీసుకువచ్చే విధంగా అధికారులు, సిబ్బంది వ్యవహరించాలన్నారు. రౌడీ షీటర్ల(rowdy sheets) పట్ల మేతక ధోరణితో వ్యవహరించవద్దని నొక్కి చెప్పారు. ఫిర్యాదులు వచ్చిన తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
Central Zone | రౌడీయిజంపై ఉక్కుపాదం మోపండి
నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్ ఖచ్చితంగా అమలు చేయాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ అధికారులు, సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారులు ఇచ్చే ఫిర్యాదులపై విచారణ చేసి, న్యాయం చేకూర్చాలన్నారు. అవినీతికి ఆస్కారమివ్వకుండా నిజాయితీగా, నిబద్ధతతో పని చేయాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉద్బోధించారు. అనంతరం సీపీ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్(Central Zone) డీసీపీ కవిత, ఏ.ఎస్పీ శుభం ప్రకాష్, ఇన్స్ స్పెక్టర్ రమేష్ తో పాటు ఎస్.ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
