Railway Police | కంసాన్ పల్లిలో విషాదం..!

Railway Police | కంసాన్ పల్లిలో విషాదం..!

  • గ్రామ పంచాయతీ 4వ వార్డు అభ్యర్థి ఆత్మహత్య..
  • నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలంటూ కొందరి వేధింపులు..?
  • గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంచలనం
  • కంసాన్ పల్లికి చెందిన బిజెపి మద్దతుదారుడు ఆవశేఖర్ మృతి
  • సంఘటనపై గ్రామస్తుల ఆగ్రహం

Railway Police | షాద్ నగర్, ఆంధ్ర ప్రభ : షాద్ నగర్ నియోజకవర్గ గ్రామపంచాయతీ ఎన్నికల వేళ అపశృతి చోటుచేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో ఆవశేఖర్(Avasekhar) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడడంతో సంచలనంగా మారింది. ఆవశేఖర్ గ్రామ 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తుండడం.. ఇంతలోనే ఆవశేఖర్ రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న సమాచారం గ్రామాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

రైల్వే పోలీసులు గ్రామస్తులకు అందించిన సమాచారం ప్రకారం రైలు పట్టాలపై ఆత్మహత్యకు(commit suicide) పాల్పడ్డాడని భావిస్తున్న పోలీసులు.. మృతదేహం వద్ద ఆధార్ కార్డు లభించడంతో అతను కంసాన్ పల్లికి చెందిన ఆవశేఖర్ గా గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందజేశారు.

ఆవశేఖర్ కంసాన్ పల్లి గ్రామ నాలుగో వార్డు స‌భ్యుని పదవికి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గత నాలుగు రోజులుగా గ్రామంలో కొందరు శేఖర్ ను పోటీ నుండి తప్పుకోవాలని తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని కొందరు ఒత్తిడి తీసుకురావడం వేధింపులకు గురి చేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

నామినేషన్(Nomination) ఉపసంహరించుకోకపోతే లేనిపోని అవంతరాలు సృష్టించి కేసులు పెడతామని, అమ్మాయిని బలత్కరించినట్లు రేప్ కేసులు కూడా నమోదు చేయిస్తామని శేఖర్ ను కొందరు బెదిరించినట్లు గ్రామస్తులు కొందరు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శేఖర్ గ్రామంలో కొంతమంది వద్ద ఈ విషయం చెప్పి కన్నీరు మున్నీరుగా విలపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కొంతమంది గ్రామానికి చెందిన వారు తన నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని చెబుతున్నారని గ్రామ పెద్దల దృష్టికి కూడా తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శేఖర్ మంగళవారం ఉదయం కనిపించకుండా పోయాడు. కాసేపటి క్రితం రైల్వే పోలీసులు ఆవశేఖర్ రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందించ‌డంతో అది హత్యా..? లేక ఆత్మహత్యా..? అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం రైల్వే పోలీసులు(Railway Police) విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా ఈ మృతి వెనుక రాజకీయ కోణం, గ్రామపంచాయతీ ఎన్నికల వ్యవహారం ఉందని ఆరోపణలు వస్తుండడంతో ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ మద్దతుదారుడిగా చెబుతున్న గ్రామస్తులు ఆవశేఖర్ మరణానికి గ్రామానికి చెందినవారు కొందరు కారణమనే విషయాన్ని చెబుతుండ‌డంతో గ్రామంలో పరిస్థితులు నివురుగ‌ప్పిన నిప్పులా మారాయి.

Leave a Reply