BRS | హ‌స్తం గూటికి బీఆర్ఎస్ నాయకులు

BRS | చిట్యాల, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే వేముల వీరేశం చేపడుతున్న అభివృద్ధి పనులను(Development works) చూసి ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లోకి చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా నాయకులు సుంకనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆవుల సునీత యాదయ్య( aavula Sunitha Yadayya) అన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొత్త శంకరయ్య, ఆవుల అంజయ్య, ఆవుల లింగస్వామి, ఆవుల స్వామి, ఆవుల శ్రీశైలం, కొత్త శ్రీశైలం, ఆవుల రవీందర్, యాకారి కిషన్, యాకారి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply