Arrangement | నామినేషన్ కేంద్రాల తనిఖీ

Arrangement | పెద్దవంగర, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను డీఎస్పీ కృష్ణకిషోర్(DSP Krishna Kishore) మంగళవారం పెద్దవంగర, చిట్యాలలో తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందితో మాట్లాడి ఎన్ని నామినేషన్లు(Nominations) దాఖలయ్యాయో తెలుసుకొని, పలు సూచనలు చేశారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బంధీగా(As a restraint) బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి (rule of thumb) అందరూ పాటించేలా చూడాలన్నారు. స్థానిక ప్రజలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ తనిఖీలో సీఐ గణేష్, ఎస్సై ప్రమోద్ కుమార్, ఏఎస్సై హిదాయత్ అలీ, కానిస్టేబుల్ అనూష, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.