Tirumala | దిత్వా తుఫాను నేపథ్యంలో..
Tirumala | దిత్వా తుఫాను నేపథ్యంలో..
- ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లు సిద్ధం..
- ప్రమాద ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం..
Tirumala, ఆంధ్రప్రభ : ‘దిత్వా’ తుఫాను (Ditwah Cyclone) ప్రభావం నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. జిల్లాలో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తుఫాను పరిస్థితుల దృష్ట్యా మూడు ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లను జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేయగా, ప్రతి సబ్ డివిజన్లో అదనంగా ఒక్కో రెస్క్యూ టీమ్‌ను సిద్ధంగా ఉంచారు. ఈ బృందాలకు లైటింగ్ పరికరాలు, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, తాళ్లు, బాటన్లు వంటి అత్యవసర రక్షణ సామగ్రిని అందించారు.
వాగులు, వంకలు, నదులు, చెరువులు, డ్యామ్‌లు, కాలువల పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. అవసరమైతే.. శీఘ్రంగా తరలింపు చర్యలు తీసుకునేందుకు పునరావాస కేంద్రాలు, సహాయక శిబిరాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. నీరు మునిగే అవకాశం ఉన్న రహదారుల పై పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రమాదకర మార్గాలను మూసివేయడంతో పాటు ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించే ఏర్పాట్లు చేసారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో గస్తీని మరింత బలోపేతం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ… “అధిక ప్రవాహం ఉన్న వాగులు, వంకలు, నదులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే డయల్ 112 లేదా జిల్లా కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇవ్వండి. పోలీస్, రెవెన్యూ, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఎర్ఎఫ్ బృందాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి” అని అత్యవసర అయితే.. డయల్ 112, జిల్లా కంట్రోల్ రూమ్: 80999 99977 ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని చెప్పారు.
