Jukkal | బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి….

Jukkal | బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి….

మాజీ ఎమ్మెల్యే సొంత ఊరిలో పార్టీ మారిన నాయకులు


Jukkal | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల వేల నాయకులు పార్టీలు మారుతున్నారు. కామారెడ్డి జిల్లా (Kamareddy District) జుక్కల్ మండలంలోని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే (Hanmant Shinde) సొంత గ్రామమైన డోన్ గాం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ అప్ప ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ (BRS) వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు (MLA Thota Lakshmi Kantha Rao) వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలు చూసి ఆయా పార్టీల వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ (Congress party) లో చేరిన వారందరికీ సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. బీఆర్ఎస్ డోన్ గాం గ్రామ అధ్యక్షుడు సంజీవ్ పాటిల్, సంతోష్, రమా సాయిలు, మారుతి తదితరులు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంతోష్ అప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.