Mission Bhagiratha | నేల పాలవుతున్న మిషన్ భగీరథ నీరు

Mission Bhagiratha | నేల పాలవుతున్న మిషన్ భగీరథ నీరు
- …కాలువలా ప్రవహిస్తున్న మంచి నీరు
- .. పట్టించుకోని గ్రేడ్ అధికారులు
Mission Bhagiratha | జుక్కల్(కామారెడ్డి) ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో మిషన్ భగీరథ( గ్రీడ్) అధికారులు పనితీరుపై సర్వత్ర నిరసన వ్యక్తం అవుతుంది. మిషన్ భగీరథ(Mission Bhagiratha) ద్వారా జుక్కల్ మండలంలో మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఎప్పుడు మంచి నీరు వస్తాయో, ఎప్పుడు రావొ తెలియని పరిస్థితి నెలకొంది.
దీంతో మండల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క నీటి చుక్కను ఒడిసి పట్టుకోవాలని, నీటి వృదా నివారించాలని ప్రభుత్వ ఆదేశాలను మిషన్ భగీరథ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ నుండి బస్వాపూర్‌కు పోయే రహదారిలో మార్గమధ్యంలో మెయిన్ పైపు వాల్(Main Pipe Wall) వద్ద లీకేజ్ కావటంతో వారం రోజుల నుండి నీరు వరద కాలువలు, నేల పాలు అవుతుంది. ప్రజలకు త్రాగడానికి అవసరమైన నీరు రాత్రి పగలు వృధాగా పోవటంతో మండల ప్రజలు తమ ఆగ్రహం వ్యక్తపరిస్తున్నారు.
కొందరు యువకులు ముందుకొచ్చి మిషన్ భగీరథ డీఈఈ కౌశిక్(DEE Kaushik)కి సమాచారం అందించగా ఆయన ఏఈకి సూచించాలని బాధ్యతారహితంగా జవాబు ఇవ్వటం జరిగింది. జుక్కల్ మండల కేంద్రంలో కూడా నీటి సరఫరా సజావుగా సాగటంలేదు. ఏదిఏమైనా ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు జుక్కల్ పై ప్రత్యేక దృష్టి సారించి మిషన్ భగీరథ ద్వారా సరిహద్దు ప్రజలకు మంచి నీటి సరఫరాకు కృషి చేయాలని జుక్కల్ మండల వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
