Champion Ship-2025 | బంగారు, వెండి పతకాలు కైవసం

Champion Ship-2025 | బంగారు, వెండి పతకాలు కైవసం
Champion Ship-2025 | కరీమాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వాని(Karimabad Govt)కి చెందిన కివి హై స్కూల్(Karimabad Govt) విద్యార్థులు బంగారు, వెండి పథకాలు కైవసం చేసుకున్నారు. అమర్చంద్ కళ్యాణ మండపం, పెద్దపల్లిలో బి. యమ్. ఆర్ కరాటే & సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ(Karate & Self Defense Academy), తెలంగాణ, పెద్దపల్లి బ్రాంచ్ 4వ రాష్ట్ర స్థాయి కరాటే చాంపియన్ షిప్-2025(Champion Ship-2025) పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలకు గాను 15 జిల్లాల నుండి 500మంది విద్యార్తులు హాజరయ్యారు. ఇందులో వరంగల్ జిల్లా కివి పబ్లిక్ హైస్కూల్, కరిమాబాద్ విద్యార్థినీ విద్యార్థులకు కటాన్ & కుమిటి విభాగాలలో బంగారు & వెండి పథకాలు సాదించడం జరిగినదని ప్రిన్సిపాల్ దాసి సతీష్ మూర్తి తెలిపా రు.
బంగారం పతకం విజేతలు. జే. లలిత్, యస్. సాత్విక్, యం.డి. సోనమ్, యస్. వరుణ్ ఇ.హిమతెజశ్రీ – వెండి పతకం విజేతలు యమ్. యొజిత్, ఏ. ఇసాకు, ఆర్. దీక్షిత, సాదించినారు. వీరిని కివి పబ్లిక్ హైస్కూల్, కరిమాబాద్ ప్రిన్సిపల్ దాసి సతిష్ మూర్తి, వైస్ ప్రిన్సిపల్ అన్నదేవర ప్రవీణ్ కుమార్లు, కోచ్ లు బండారి సంతోష్, యూ. రణదీప్, జి. వైష్ణవిలు అబినందిచారు.
