India | కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన….

India | కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన….

India | పెద్దవంగర, ఆంధ్రప్రభ : విద్యార్థి దశలో కెరీర్ గైడెన్స్(Career guidance) పాత్ర కీలకమని మండల విద్యాశాఖాధికారి బుదారపు శ్రీనివాస్(Budarapu Srinivas) అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ రోజు ఇండియా లిటరసీ ప్రాజెక్ట్(India Literacy Project) ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్ ట్రైనర్ మహ్మద్ ఖాసీం విద్యార్థులకు కెరీర్ పట్ల అవగాహన కల్పించారు. ఎంఈవో బుదారపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో చేరుకోవాల్సిన లక్ష్యాలపై స్పష్టత పొందుతారని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో తెలుసుకుంటారని, తమ ఆసక్తులు, సామర్ధ్యాలకు అనుగుణంగా సరైన కెరీర్ ఎలా ఎంచుకోవాలో అవగాహన కలుగుతుందని తెలిపారు.

విద్యార్థులకు ఇటువంటి విలువైన అవగాహన కార్యక్రమాన్ని తమ పాఠశాలలో నిర్వహించినందుకు డీఈవో దక్షిణామూర్తి కి ఎంఈవో బుదారపు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. సదయ్య, కె. హైమ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .

Leave a Reply