17th Battalion | తల్లి మృతిని తట్టుకోలేక..
17th Battalion | తల్లి మృతిని తట్టుకోలేక..
- తనయుడి ఆత్మహత్య
- సిరిసిల్లలో విషాదం
17th Battalion | సిరిసిల్ల, ఆంధ్రప్రభ : తల్లి మృతిని తట్టుకోలేక తనయుడు కూడా మానేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల మానేరు వాగు(Maneru Vagu)లో దూకి లలిత అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ రోజు ఆమె మృతదేహాం సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద లభ్యం కావడంతో తల్లి మృతదేహాన్ని చూసిన ఆమె కుమారుడు అభిలాష్(Abhilash) ఒక్కసారిగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భావోద్వేగాలను తట్టుకోలేక అక్కడికక్కడే అదే వాగులోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు.
సర్దాపూర్లోని 17వ బెటాలియన్లో(17th Battalion) కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న అభిలాష్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, 17వ బెటాలియన్ పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించారు. కొన్ని గంటలు వెతికిన అనంతరం అభిలాష్ మృతదేహం కూడా మానేరు వాగులో లభ్యమైంది.
గురువారం ఇంటినుండి వెళ్లిపోయిన తల్లి లలిత ఈ రోజు మృతదేహంగా కనపడటం, ఆ దృశ్యాన్ని తట్టుకోలేక కుమారుడు కూడా ప్రాణాలు తీసుకోవడం ఈ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. స్థానికులు, సహచర పోలీసులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబం రెండు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
