Nomination | ఒక అవ‌కాశం ఇవ్వండి…

Nomination | ఒక అవ‌కాశం ఇవ్వండి…

Nomination | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ(Nomination Process) రెండవ రోజు కోలాహలంగా కొనసాగాయి. ఈ రోజు ఎడపల్లి మండలం నెహ్రూనగర్ గ్రామానికి చెందిన ఫాతిమా బేగం(Fatima Begum) సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను అధికారుల సమక్షంలో నెహ్రూనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో దాఖలు చేశారు.

నామినేషన్ సమర్పించిన అనంతరం అభ్యర్థి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Leave a Reply