Mahabubabad | గన్నీ సంచులు రావు… ధాన్యం విక్రయాలు జరగవు
— భార్ధాన్ కోసం రోజులుగా ఎదురు చూపులు.
— రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు.
— పట్టించుకోని అధికారులు.
— ఆందోళనలో అన్నదాతలు.
Mahabubabad | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు సొసైటీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత పది రోజుల నుండి గన్నీ సంచులు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాయిచర్ వచ్చినప్పటికి బార్ధాన్(Bardhan) సమయానికి రాక కాంటాలు కావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మొన్నటి దాక కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిని అరకొర దిగుబడి వచ్చిందని, వచ్చిన కాస్త దిగుబడిని తీరా కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకొని వచ్చి ఆరబెట్టినా కాంటాలు(Kantalu) అయ్యే పరిస్థితులు లేవని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల బిజీలో పడి అధికారులు(Officials) ఎవరు కూడా కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదని, సరిపడ గన్నీ సంచులు తెప్పించటంలో అశ్రద్ధ చూపిస్తున్నారని అంటున్నారు.
కేవలం పది వేల గన్నీ సంచులు మాత్రమే వచ్చాయి.
— మరో 30 వేల సంచులు కావాలి.
కావలిసినన్ని గన్నీ సంచులు రాకపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులకు నిర్వాహకులను తెలుసుకోగా కేవలం పది వేల సంచులు మాత్రమే వచ్చాయని సుమారుగా మరో 30 నుండి 40 వేల భార్దాన్(30 to 40 thousand Bardhaman) అవసరమౌతుందని తెలిపారు. చాలా వరకు దాన్యం మాయిచర్(Danyam Moisture) వచ్చి ఉందని గన్నీలు వచ్చిన వెంటనే కాంటాలు నిర్వహించడానికి సిద్ధంగా వున్నామన్నారు.

