Nomination | అవకాశం ఇవ్వండి….

Nomination | అవకాశం ఇవ్వండి….

Nomination | కడం నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : కడం మండలంలో పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ(Nomination Process) రెండవ రోజు ఉత్సవంగా ప్రారంభమైంది. ఈ రోజు మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ లింగాపూర్ జీపీ సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి రంజిత్ కుమార్(Ranjit Kumar) స్థానిక పంచాయతీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు(Returning Officers) తమ నామినేషన్ పత్రమును దాఖలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగాపూర్ జీపీ అభివృద్ధి చేయడం తమ లక్ష్యం అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడు తాను ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply