Gudivada| నందివాడకు అంతర్జాతీయ గుర్తింపు

నందివాడకు అంతర్జాతీయ గుర్తింపు
- ఇక మరిన్ని ఆక్వా ప్రాజెక్టులు క్యూ
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Gudivada| నందివాడ, ఆంధ్రప్రభ : ఆక్వా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబులిటీ శిక్షణ ద్వారా నందివాడ మండల ఆక్వా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆక్వా రైతాంగ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యాధునిక ఆక్వా పద్ధతులపై రైతులకు శిక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబులిటీ ప్రాజెక్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే నెక్స్ట్ ఆక్వా శిక్షణ పై నందివాడ మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే రాము, ఫిషరీస్ అధికారులు పాల్గొని నూతన పద్ధతుల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన సభల్లో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడారు…. దేశంలోనే తొలిసారి ఆక్వా డిజిటల్ ట్రేసబులిటీ ప్రాజెక్ట్ లో నెక్స్ట్ ఆక్వా శిక్షణకు నందివాడ మండలంలోని అరిపురాల,రామాపురం,పుట్టగుంట,నందివాడ తుమ్మలపల్లి గ్రామాలు తొలి ఫేజ్ లో ఎంపిక అయ్యాయన్నారు.

ఈ శిక్షణ ద్వారా రైతాంగానికి గుర్తింపు సర్టిఫికెట్ అందుతుందని తద్వారా ఆక్వా ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే కాక, అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. హేచరీస్ వద్ద నుండి, మేత కొనుగోలు , సాగు ప్రక్రియలో ప్రతి అంశాన్ని నిపుణులు పర్యవేక్షిస్తారన్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యమైన వారికి వచ్చే యూనిట్ ఐ.డిల ద్వారా రైతులకు అనేక రాయితీలలో వెసులుబాటు, సులభంగా రుణాలు పొందవచ్చన్నారు. రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా అనేక ప్రాజెక్టులు కూడా మండలానికి వస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్చార్జి బూర్రగడ్డ శ్రీకాంత్,ఫిషరీస్ కమిషనర్ రమాశంకర్ నాయక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్, మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టిడిపి నాయకులు చేకూరు జగన్ మోహన్ రావు, ఆరెకపూడి రామశాస్త్రి,డీసీ చైర్మన్ యార్లగడ్డ రవిబాబు,డీసీ తాడిపత్తి సురేష్, డీసీ పమ్మిడి పెంటయ్య, ఆర్కెపూడి రామశాస్త్రి, జనసేన నాయకులు కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ కాకరాల సురేష్, ఏసుపాదం,బుసనబోయిన జగన్, మూడడ్ల రామారావు, పండరయ్య, రామకూరు సాల్మన్, పాలడుగు బుజ్జి, ఆర్కేపూడి శ్రీనివాసరావు, శివ లక్ష్మణ్, లక్ష్మణరావు, సతీష్, గోవాడ శివ,పూడపాటి వెంకటేశ్వరరావు, సాంబయ్య, పొన్నకేశవరావు, రత్న ప్రసాద్, రాధాకృష్ణ, ఎండీఓ మల్లేశ్వరి, ఎమ్మార్వో గురుమూర్తి రెడ్డి, జెడి నాగరాజు, ఫిషరీస్ ఎ.డి ప్రసాద్ , ఎండిఓ జమాయెమ్మ, ఎస్సై శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
