MLA | వైభ‌వంగా విగ్రహ ప్రతిష్ఠా మ‌హోత్స‌వం

MLA | వైభ‌వంగా విగ్రహ ప్రతిష్ఠా మ‌హోత్స‌వం

హాజ‌రైన ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ దంపతులు

MLA | గన్నవరం, ఆంధ్రప్రభ : గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు (MLA Venkat Rao) దంపతులు పాల్గొన్నారు. ఆలయంలో దాసాంజనేయ స్వామి, విఘ్నేశ్వరుని విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. ఉదయం ఆలయానికి వచ్చిన వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు ఇరువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గత మూడు రోజులుగా జరుగుతున్న హోమం ముగింపు సందర్భంగా పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ (Yarlagadda) మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి దైవానుగ్రహం తోడు కావాలని నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని దైవాన్ని కోరుకున్నట్లు చెప్పారు. విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న యార్లగడ్డ దంపతులను వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం శివ కళ్యాణం జరిపి అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, టిడిపి నాయకులు జాస్తి విజయభాషణ కుమార్(బుజ్జి), ఎం వి ఎల్ ప్రసాద్, మూల్పూరి మాధవన్, అన్నే హరికృష్ణ, కోసూరు వెంకటేష్, అన్నే అంజిబాబు, ఎస్.రామకృష్ణ, శేషు, తదితర కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply