POLICE | చైన్ స్నాచింగ్ నియంత్రణకు చర్యలు
POLICE | చైన్ స్నాచింగ్ నియంత్రణకు చర్యలు
జిల్లా ఎస్పీ పి.జగదీష్
POLICE | అనంతపురం, ఆంధ్రప్రభ : జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగకుండా పోలీసు (Police) పరంగా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పోలీసు అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై చైన్ స్నాచింగ్ నిరోధక చర్యలపై మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాలలో పోలీసులు నిఘా పెంచారు. వేకువజామునే ఇళ్ల బయట ప్రదేశాలు శుభ్రం చేయడం, ముగ్గులు పెట్టడం, వాకింగ్‌లకు వెళ్లే మహిళలను ఆయా పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.

మహిళలకు పోలీసుల విజ్ఞప్తి :
- బంగారు గొలుసులు, ఆభరణాలు స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్త పడాలి… సెల్ ఫోన్ మాట్లాడుతూ నడవడం, వాహనం నడపడం చేయరాదు ఇది దొంగలకు లక్ష్యంగా మారే అవకాశాన్ని పెంచుతుంది.
- సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు ఉన్న వీధులు, మార్గాలు ఉపయోగించండి… చీకటి ఉన్న గల్లీలు, శివారు మరియు ఓంటరి ప్రాంతాలను తప్పించడం ఉత్తమం.
- హ్యాండ్‌బ్యాగ్/పర్సును రోడ్డుకు విరుద్ధ దిశలో ధరించండి. బ్యాగ్‌ను బిగుసుగా పట్టుకోవడం మంచిది.
- అనుమానాస్పదంగా వెంబడించే బైక్‌లు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే పబ్లిక్ ప్రదేశానికి వెళ్లండి మరియు అవసరమైతే కుటుంబ సభ్యులకు, సంబంధిత పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వండి.
- ఏదైనా ఘటన జరిగితే వెంటనే Dial 100 / 112 కు కాల్ చేసి పరిస్థితిని పోలీసులకు తెలియజేయండి
- నిందితుల బైక్ రంగు, నంబర్, దుస్తులు, వ్యక్తుల సంఖ్య వంటి వివరాలను గమనించడానికి ప్రయత్నించండి.

ప్రజలకు విజ్ఞప్తి :
- నేర నియంత్రణలో పోలీసులతో కలిసి పని చేయడం ప్రతి పౌరుడి బాధ్యత.
- గ్రామాల, పట్టణాల పరిధిలో చైన్–స్నాచింగ్ ఘటనలు గమనించినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. భద్రత కోసం ఏర్పాటు చేసిన రాత్రి పర్యవేక్షణ, మొబైల్ పెట్రోలింగ్ (Mobile patrolling) సీసీ కెమెరాల పర్యవేక్షణ మరింత బలోపేతం చేయబడింది. మహిళల భద్రత, ప్రజల రక్షణ కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజల సహకారం మరింత అవసరం.


