High Court | గ్రూప్-2 ర్యాంకర్లకు ఊరట

High Court | గ్రూప్-2 ర్యాంకర్లకు ఊరట
సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సీజే బెంచీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : 2015-16లో నిర్వహించిన గ్రూప్-2 (Group-2) ఎంపికల ఫైనల్ జాబితాను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు (High Court) చీఫ్ జస్టిస్ ధర్మాసనం గురువారం సస్పెండ్ చేసింది.
వైట్నర్, దిద్దుబాట్లు ఉన్న జవాబు పత్రాల మూల్యాంకనంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ (single bench) ఎంపిక జాబితాను పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో ర్యాంకర్లు దాఖలు చేసిన అప్పీళ్లపై సీజే అలోక్ అరాధే, జస్టిస్ అనీల్ కుమార్ జుకంటి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను స్టే చేస్తూ, ఈ కేసును డివిజన్ బెంచ్‌కు కేటాయించింది. ఈ తీర్పుతో 2015 గ్రూప్-2లో ఎంపికైన వందలాది మంది ర్యాంకర్లకు తాత్కాలిక ఊరట లభించింది. కేసు తదుపరి విచారణ వరకు ఎంపిక జాబితా రద్దు కార్యక్రమం నిలిచిపోనుంది.
