IFTU | కార్మికులపై తీవ్ర ఒత్తిడి…
IFTU | కార్మికులపై తీవ్ర ఒత్తిడి…
IFTU జిల్లా నాయకులు ఎస్.బాలరాజు,ఏఐకెఎంఎస్ జిల్లా కార్యదర్శి ఎం.సత్యన్న
IFTU | ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను,తక్షణమే ఉపసంహరించుకోవాలని IFTU జిల్లా నాయకులు ఎస్.బాలరాజు (S.Balaraju) ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ఎం.సత్యన్న డిమాండ్ చేశారు. బుధవారం నాడు రాష్ట్ర కార్మిక రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సంఘాల పిలుపుమేరకు,స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ నందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ బాలరాజు, కామ్రేడ్స్ సత్యన్న మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని అన్నారు. నేటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టపరిహారం రాష్ట్రాలకు అందలేదని తెలిపారు. పంటకు కనీస మద్దతు ధర ప్రకటించ పోవడంతో రైతంగం తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రాష్ట్రంలోని ప్రధానమైన వరి, పత్తి ,జొన్న మొక్కజొన్న, టమోటా ,మిరప పండించిన పంటలు అధిక వర్షాల వల్ల పూర్తిగా దెబ్బ తిన్నాయని తెలిపారు.
తక్షణ సహాయం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం (State Govt) నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం వలన రాష్ట్రంలోని రైతాంగం అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నాలుగు లేబర్ కోడులుగా విభజించడం వలన కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం పెంచి 12 గంటలు చేయడం వలన కార్మికులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పన సరైన స్పష్టత ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు తలవంచడం సరైనది కాదని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్ల సేవలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు.రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ దేశ ప్రజల ఆకాంక్షను ప్రజల్లో ముందుకు తీసుకుపోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, తక్షణమే కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.
