Ganja | గంజాయి కేసు..

Ganja | గంజాయి కేసు..

  • ఎస్పీ ఆదేశంతో రెండు రోజులుగా కొనసాగుతున్న సోదాలు
  • నేడు కేసు నమోదు చేసే అవకాశం..

Ganja, జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా (Kamareddy) జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామ శివార్లలో పత్తి పంటలో అంతర్ పంటగా గంజాయి సాగు చేయడం, పంటపొలాల్లోనే ఎండబెట్టటం, దీనితో పాటు ఇంట్లో కూడా ఎండు గంజాయి నిల్వ ఉందన్న పక్కా సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం రెండు రోజులుగా పెద్ద గుల్ల మహారాష్ట్ర బోర్డర్ వద్ద గంజాయి సాగు పంట పొలం పై పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నట్టు విశ్వశనియంగా తెలిసింది. పోలీసులు గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకోవటమే కాకుండా, పంట పొలంలో సదరు వ్యక్తి ఇంటి వద్ద కూడా ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

తమ పంట పొలాల్లో అంతర్ పంటగా సాగు చేస్తున్నవారు ముగ్గురు అన్నదమ్ములు ఉండగా, ఒకరి పంట పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్టు తేలింది. సోదాలో పాల్గొన్న బిచ్కుంద, పెద్ద కొడప్ గాల్ పోలీసులు (Police) పకడ్బందీగా సోదాలు చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు నేడు గంజాయి సాగులో ఎవరెవరున్నారు అన్నది తేల్చి వారి పై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు హాంగర్గ శివారులో ఒక వ్యక్తి గంజాయి సాగు చేసిన ఘటన మరువక ముందే మరో గంజాయి సాగు వ్యవహారం బయటపడటంతో బిచ్కుంద అబ్కారీ శాఖ పై విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply