Ex Miss India Legal Fight : న్యాయం కోసం ..
Ex Miss India Legal Fight : న్యాయం కోసం ..
- గోల్ మాల్ రిటన్స్ ..
- నో ఎంట్రీ అందాల రాశి
- బాలీవుడ్ హీరోయిన్ సెలీనా
- భర్తపై తిరుబాటు
- రూ.50 కోట్ల పరిహారం డిమాండ్
(ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)
భారతీయ అందాల రాశి (Ex Miss Inida) , బాలీవుడ్ హీరోయిన్.. సెలీనా జైట్లీ న్యాయం కోసం ( Legal Fight for Justice) ముంబైలోని అంధేరీ కోర్టు తలుపులు తట్టింది. తన భర్త నిత్యం తనను శారీకంగా, మానపికంగా, ఆర్థికంగా వేధిస్తున్నాడని కోర్టుకు ఫిర్యాదు చేసింది. గృహ హింస చట్టం (Domestic Harassment) ప్రకారం తనకు తగిన న్యాయం చేయాలని సెలీనా జైట్లీ తన భర్త పై కేసు దాఖలు చేసింది. ఈ మేరకు మంగళవారం (నవంబర్ 25న) అంధేరిలోని లీగల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎస్.సి. టడ్యే కోర్టు (Andheri Tadye Court) ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది.

భర్త హగ్ కు నోటీసులు జారీ చేసింది. జాతీయ మీడియా సంస్థల సమాచారం మేరకు, తన ఆదాయ వనరులు, ఆస్తుల నష్టానికి రూ.50 కోట్ల పరిహారం (Compensation) , మరో రూ.50 కోట్లు భరణం (alimony) చెల్లించాలని కోరారు. విదేశీ సంపన్నుడిని పెళ్లాడి, మెట్టినింటి పౌరసత్వం తీసుకుని 15 ఏళ్లు కాపురం అనంతనం సెలీనాజైట్లీ పుట్టినింటికి చేరటానికి కారణాలేంటీ?
నో ఎంట్రీ, గోల్ మాల్ రిటర్న్స్ హిందీ చిత్రాలలో పనిచేసిన జైట్లీ ఆస్ట్రియన్ ఫౌండర్, హోటలియర్ పీటర్ హగ్‌ను (Husbond) 2011లో సెలీనా వివాహం చేసుకుంది 2012లో విన్స్టన్, విరాజ్ అనే కవలలు జన్మించారు. 2017లో షంషేర్, ఆర్థర్ అనే మరో కవలలు జన్మించారు. 2017లో జన్మించిన కవలల్లో షంషేర్ గుండె సమస్యతో మరణించాడు.
Ex Miss India Legal Fightభర్తపై తిరుగుబాటు

సెలీనా జైట్లీ మంగళవారం (నవంబర్ 25) మధ్యాహ్నం తన ఫేస్బుక్ పేజీలో ఒక గ్రీన్ చీరలో కిటికీ దగ్గర కూర్చున్న థ్రో బ్యాక్ ఫొటో షేర్ చేస్తూ ఒక నోట్‌ను పంచుకుంది. “నా జీవితంలో అత్యంత బలమైన, అత్యంత అల్లకల్లోలమైన తుఫాను మధ్యలో నేను ఒంటరిగా పోరాడుతానని ఎప్పుడూ ఊహించలేదు.
తల్లిదండ్రులు, ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ లేకుండా, ఒకప్పుడు ఆధారపడిన నా తల్లిదండ్రులు, నా సోదరుడు, నా పిల్లలు, నాకు అండగా నిలుస్తానని, నన్ను ప్రేమిస్తానని, నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని, ప్రతి కష్టాన్ని నాతో పంచుకుంటానని వాగ్దానం చేసిన వ్యక్తి.. వీరెవరూ లేని రోజు వస్తుందని నేను అనుకోలేదు” అని సెలీనా బాధపడింది.
తనను తీవ్ర భావోద్వేగ, శారీరక, మౌఖిక ఆర్థిక వేధింపులకు హగ్ గురిచేశాడని, ఆమె అర్ధరాత్రి ఆస్ట్రియాలోని తమ ఇంటి గడప దాటి బయటకు రాక తప్పలేదని, అక్టోబర్ 11న పుట్టినింటికి తిరిగి వచ్చినట్టు ఆరోపించింది. తన పిల్లలను అన్ని విధాలుగా తన వద్దకు రాకుండా తన భర్త అడ్డుకున్నాడని, ఆస్ట్రియాలో కూడా విడాకుల కోసం జైట్లీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు తన పిటిషన్లో సెలీనా పేర్కొన్నారు, హాగ్ (Peter Hug) నుంచి నెలకు రూ. 10 లక్షల భరణం సెలీనా కోరుతోంది.
తనకు జరిగిన వేధింపుల వల్ల తనకు కలిగిన ఆదాయ నష్టానికి రూ. 50 కోట్లు, పరిహారంగా రూ. 50 కోట్లు కూడా చెల్లించాలని కోరింది. ముంబై అంధేరిలోని తమ ఉమ్మడి ఇంటిని తనకు అప్పగించాలని, ప్రవేశించకుండా హాగ్ అడ్డుకునే ఆదేశాలు ఇవ్వాలని జైట్లీ కోరింది. ముంబై వియన్నా ఆస్తులను తన నియంత్రణ నుండి తొలగించడం వల్ల తనకు జరిగిన నష్టానికి రూ. 1.26 కోట్లు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మరో రూ. 32 లక్షలు ఇవ్వాలని కూడా ఆమె కోరింది.
Ex Miss India Legal Fight అన్న విముక్తి కోసం..

మాజీ మిస్ ఇండియా విజేత న సెలీనా జైట్లీ ఇటీవల తన సోదరుడు, మేజర్ (రిటైర్డ్) విక్రాంత్ జైట్లీ (Vikrant Jaitley) విషయంలోనూ వార్తల్లో నిలిచింది. సెప్టెంబర్ 2024లో తన సోదరుడిని యూఏఈలో అక్రమంగా నిర్బంధించారని ఆమె ఆరోపించింది.
సెలీనా జైట్లీ సోదరుడికి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్ 7న వీక్లీ మీడియా బ్రీఫింగ్లో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Ran Dheer Jaiswal) మాట్లాడుతూ.. “మా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని పరిశీలిస్తోంది.
అతన్ని నాలుగు సార్లు కాన్సులర్ విజిట్స్ చేశాం” అని తెలిపారు. తన సోదరుడికి చట్టపరమైన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సెలీనా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. మాజీ ఆర్మీ అధికారి విక్రాంత్‌కు చట్టపరమైన సహాయం అందించాలని విదేశాంగ శాఖకు స్పష్టం చేసింది.
Ex Miss India Legal Fight అందరికీ దూరమయ్యా

సెలీనా కవితాత్మకంగా తాను పడుతున్న బాధలను వర్ణించింది. “జీవితం ప్రతిదీ దూరం చేసింది. నేను నమ్మిన వ్యక్తులు దూరమయ్యారు. నేను నమ్మిన వాగ్దానాలు కల్లలయ్యాయి. కానీ ఈ తుపాను నన్ను ముంచివేయలేదు..
ఎందుకంటే నేను సైనికుడి కూతురిని. ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల, ఫైర్, విశ్వాసంతో పెరిగాను. ప్రపంచం నన్ను పడగొట్టాలనుకున్నప్పుడు లేచి నిలబడాలని, నా గుండె ముక్కలవుతున్నా పోరాడాలని, నాకు అన్యాయం జరిగినప్పుడు కనికరం చూపకూడదని, అసాధ్యమనిపించినా బతికి ఉండాలని నాకు నేర్పించారు” అని సెలీనా చెప్పింది.
దాదాపు ఏడాదిగా యూఏఈ నిర్బంధంలో ఉన్న తన సోదరుడిని తిరిగి తీసుకురావడంపైనే తాను ప్రస్తుతం దృష్టి సారిస్తున్నానని ఆమె తెలిపింది. “నా సైనిక సోదరుడి ( For Army Brother) కోసం పోరాడుతా, నా పిల్లల ప్రేమ కోసం పోరాడుతా (Fight for love) , నా గౌరవం కోసం పోరాడటమే నా ప్రాధాన్యతగా మిగిలింది” అని సెలీనా చెప్పింది. ఆస్ట్రియాలో 15 ఏళ్ల కాపురంలో.. రెండు కవల జంటలకు జన్మనిచ్చి.. పండంటి ముగ్గురు పిల్లలకు దూరమైన వేళ సెలినా గుండె కోత వర్ణనాతీతం. ఆ బిడ్డలు కూడా తల్లిని వీడి ఉండగలరా? ఆమెకు న్యాయం జరగాలని సెలీనా అభిమానులు కోరుతున్నారు.
