Hospital | పాము కాటుకు వ్యక్తి మృతి
Hospital | పాము కాటుకు వ్యక్తి మృతి
Hospital | ఊట్కూర్, ఆంధ్రప్రభ : పాము కాటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఎడవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై రమేష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన సాయిలు(36) అనే వ్యక్తి ఈనెల 19న వ్యవసాయ పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.
మరుసటి రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో భర్త మేల్కొనక పోవడంతో చికిత్స నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)కి తరలించగా అక్కడ ప్రథమ చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా(Mahbubnagar District) ఆస్పత్రికి తరలించగా పాము కాటు వేసినట్లు వైద్యులు గుర్తించారు. వైద్య చికిత్సలు చేస్తుండగా ఈనెల 24న చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై మృతుని భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
