Huzurnagar | ఔటర్ రింగ్ రోడ్డు 95 శాతం పూర్తి

Huzurnagar | ఔటర్ రింగ్ రోడ్డు 95 శాతం పూర్తి
Huzurnagar |హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్ నగర్ పట్టణంలో వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్య దృష్టిలో ఉంచుకొని 2013లో ఔటర్ రింగ్ రోడ్డు పనులకు రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభించారు. అప్పట్లోనే 60 శాతం రోడ్డు పూర్తయిన 2014 అధికారంలోకి వచ్చిన బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో పనులు జరగకుండా నిర్లక్ష్యం చేసినారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రింగ్ రోడ్డు పనులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష చేసి మెరుగైన రవాణా సౌకర్యం ప్రజలకు కల్పించాలని ఉద్దేశంతో మరల రూ.5 కోట్లు నిధులు వెంటనే మంజూరు చేసి రింగ్ రోడ్డు పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించిన నేపద్యంలో రింగ్ రోడ్డు పనులు 95 శాతం పూర్తి చేసారు.
Huzurnagar | రూ.5 కోట్లు నిధులు వెంటనే మంజూరు
సోమవారం స్తానిక కాంగ్రెస్ ముఖ్య నాయకులు రింగ్ రోడ్డు పనులను పరిశీలన చేసి త్వరలో రింగ్ రోడ్డు ప్రజా వినియోగంలోకి వస్తుందని, కేవలం జంక్షన్ రోడ్లు పనులు మిగిలి ఉన్నాయన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న వివిధ ఫ్యాక్టరీల భారీ వాహనాలు కోదాడ, మిర్యాలగూడ నుంచి వచ్చే వాహనాలు ఈ ఔటర్ రింగు రోడ్డు ద్వారానే వెళ్తాయని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం, ట్రాఫిక్ సమస్య పరిష్కారం, దశాబ్దాల ప్రజల కోరిక త్వరలోనే నెరవేరబోతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ జాయింట్ సెక్రటరీ ఎమ్.డి అజీజ్ పాషా, మాజీ మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్, చావా కిరణ్మయి, జక్కుల మల్లయ్య, అబ్దుల్ మజీద్, జక్కుల శoబయ్య, గంజి శివ, బొడ్డు గోవిందరావు, మన్సూర్ అలీ, పోతుల జ్ఞానయ్య, చావా సహదేవరావు, కోల మట్టయ్య, ముషం సత్యనారాయణ, బెల్లంకొండ వెంకట్ నారాయణ, రాయల వెంకటేశ్వర్లు,జాల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
