Komatireddy | శంకుస్థాపన..
రూ.5 లక్షల రూపాయలతో భవన నిర్మాణ పనులు
Komatireddy| nగట్టుప్పల, ఆంధ్రప్రభ : గట్టుప్పల, మండల కేంద్రంలోని వడ్డెర సంఘం భవనం అసంపూర్తిగా ఉండడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధుల నుండి మంజూరైన ఎస్డిఎఫ్ రూ.5 లక్షల రూపాయలతో భవన నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నామని జగన్నాథం, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దండు యాదగిరిరెడ్డి, వడ్డెర సంఘం నాయకులతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.
గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షులు సామల యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోదుగు బాల్ రెడ్డి, భీమగాని మల్లేశం, దోర్నాల అంజయ్య, చెరుపల్లి సత్తయ్య, అబ్బాస్, పగిళ్ల శంకరయ్య, లడే యాదయ్య, వడ్డెర సంఘం నాయకులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
