Modi | నూతన లేబర్ కోడ్..

Modi | నూతన లేబర్ కోడ్..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వ లేబర్ కోడ్లు దేశంలోని కార్మిక చట్టాల చరిత్రలో ఒక గొప్ప సంస్క రణ అని మాజీ గవర్నర్ దత్తాత్రేయ (Bandaru Dattatraya) అన్నా రు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి 4 ప్రధాన లేబర్ కోడ్లుగా రూపొందించడం, సరళత, పారదర్శకత, సమర్థత, కార్మికుల సంక్షేమ దృష్ట్యా తీసుకున్న కీలక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ అంశం పై ఆదివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడారు. నూతన లేబర్ కోడ్స్ ద్వారా అసంఘటితరంగం, గిగ్ వర్కర్లు, ప్లాట్ఫార్మ్ వర్కర్లు వంటి వర్గాలు కూడా సామాజిక భద్రత లభిస్తుందన్నారు. వేతనాల్లో పారదర్శకత, సమయానుకూల సవరణలు – కార్మికుల జీవన ప్రమాణం మెరుగుపడే దిశగా మార్పులు చేశారని కొనియాడారు.

మహిళా కార్మికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం – సురక్షితమైన కార్యాలయ వాతావరణం, గౌరవప్రదమైన పని పరిస్థితులు కల్పించేందుకు నిబంధనలు చేర్చారన్నారు. పరిశ్ర మలకు సరళీకృత విధానాలు – పెట్టుబడులు, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాలు పెరిగేలా వ్యవస్థను రూపొందించారని వివరించారు. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం తదితర అంశాలు ఈ కోడ్ ద్వారా అమల్లోకి వచ్చాయన్నారు. ఈ సంస్కరణల్లో తాను భాగస్వామిగా ఉండటం తన జీవితంలో ఒక గొప్ప గౌరవమని వ్యాఖ్యానించారు. “చట్టాలు కాగితం మీద మాత్రమే కాకుండా – కార్మి కుల జీవితాలలో మార్పు తెచ్చేలా అమలు కావాలి” అని ఆకాంక్షించారు.

మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి..
https://epaper.prabhanews.com

Leave a Reply