Boat capsized  :  రైవాడలో పడవ బోల్తా

Boat capsized  :  రైవాడలో పడవ బోల్తా

  • ముగ్గురు గల్లంతు
  • ఒకరి మృతదేహం లభ్యం

( ఆంధ్రప్రభ, అనంతగిరి) 

అల్లూరి సీతారామరాజు జిల్లా  అనంతగిరి మండలం జీనపాడు   రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడి  ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి  మృతదేహం లభించింది.  మృతుడు జీనపాడు కి చెందిన  గంజి జీవన్ ( Ganji Jeevan)  గా స్థానికులు  గుర్తించారు.  

Boat capsized

ఫారెస్ట్ వాచర్ అప్పలరాజు తో కలసి మరో ముగ్గురు వ్యక్తులు (Three Missed)   అనంతగిరి మండలం  జీనపాడు రేవు వద్ద  రైవాడ జలాశయం (Rivada Resorvoir)   అటవీ ప్రాంతానికి నాటు పడవపై బయలు దేరారు.  తిరిగి ఒడ్డుకు వస్తున్న సమయంలో  ఒడ్డుకు కొద్ది దూరంలో  పడవ బోల్తా ( Boat capsized}  పడింది.

Boat capsized

పడవలోని  జీనపాడుకి (Jeenapadu) చెందిన  జలద ప్రసాద్ (Jalada Prasad Safe)  ఒడ్డుకు చేరుకోగా ముగ్గురు  నీటిలో మునిగిపోయారు. ఫారెస్ట్ వాచర్ అప్పలరాజు (Appala Raju,, దబర రమేష్ (Dabara Ramesh)  కోసం స్థానికులు గాలిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అక్రమ కలప అడ్డుకునేందుకు ఈ ముగ్గురు వెళ్ళినట్టు  స్థానికులు చెబుతున్నారు.

Boat capsized