PRINCIPAL | ప్రిన్సిపాల్ కు లీగల్ నోటీసులు

మైనారిటీ గురుకుల పాఠశాల వివాదం
మహబూబాబాద్ మైనారిటీ గురుకుల పాఠశాల వివాదం ఆదివారం కీలక దశకు చేరింది. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శ్రీనివాసరావుకు ముస్లిం మైనారిటీ అసోసియేషన్ నాయకులు అధికారిక లీగల్ నోటీసులు జారీ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో అసభ్య గీతాలకు నృత్యాలు చేయించారన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పవిత్ర వేడుకను అవమానించినట్లుగా ప్రిన్సిపాల్ వ్యవహరించారని సమాజం విస్తృతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు కలిసి ఘాటైన ప్రతిస్పందన తెలియజేశాయి. జిల్లా పరిపాలన తక్షణం చర్యలు తీసుకోవాలని పిర్యాదులు వరుసగా వెల్లువెత్తుతున్నాయి. లీగల్ నోటీసుల జారీతో ప్రిన్సిపాల్‌పై న్యాయపరమైన ఒత్తిడి మరింతగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
