TG | మహిళా శక్తి చీరల పంపిణీ

TG | మహిళా శక్తి చీరల పంపిణీ

TG | తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారము తాడ్వాయి మండలంలోని అన్ని గ్రామాలలో చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది.
కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా (Making millions of women millionaires) ప్రభుత్వ లక్ష్యంగా అమలుపరుస్తున్న కార్యక్రమంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు మహిళా సంఘ లా ద్వారా రుణాలు అందించటం వాటి ద్వారా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అలాగే మహిళల ఆత్మబిమానం పెంపొందించే విధంగా ఇందిరా మహిళా శక్తి చీరలను నాణ్యతగా తయారు చేయించి మహిళలకు అందజేయడం జరుగుచున్నది. మొత్తం మండలంలో 7260 చీరలు రావడం జరిగినది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జక్కుల రాజి రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ (Congress party) మండల అధ్యక్షులు వెంకట రెడ్డి, అధికార ప్రతినిధి షౌకత్ , తాడ్వాయి వీడిసి అధ్యక్షుడు మేకల రాజు, ఏఎంసి మాజీ చైర్మన్ శ్యామ్ రావు, సుధాకర్ రావు, బండారి సంజీవులు, ఏపీఎం రాజు అన్ని గ్రామ సంఘాల అధ్యక్షురాలు ,గ్రామ పెద్దలు మండల స్థాయి ప్రజాప్రతినిధులు ఐకెపి , సీసీలు ,వివోఏలు పాల్గొన్నారు.

Leave a Reply