ACCIDENT| రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి..
ACCIDENT| గంగాధర నెల్లూరు, ఆంధ్రప్రభ : గంగాధర నెల్లూరు మండలంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్థానికుల వివరాల మేరకు.. బైక్ పై ముగ్గురు వ్యక్తులు గంగాధర నెల్లూరు నుంచి ఎట్టెరికి వెళుతుండగా మోత రాంగనపల్లె వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తులు అరుణాచలం అతను కోటా గరం గ్రామానికి చెందిన వ్యక్తి. మరో వ్యక్తి కుమార్ ఈ ఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చనిపోయిన వ్యక్తులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
