Peddapalli | చెక్ డ్యామ్ పేల్చివేత

Peddapalli | చెక్ డ్యామ్ పేల్చివేత

ఇసుక అక్రమార్కుల దుశ్చర్య
రూ.3కోట్ల ఆస్తి నష్టం


Peddapalli | ఓదెల, ఆంధ్రప్రభ : ఇసుక అక్రమార్కులు తమ వ్యాపారం కోసం దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ రవాణా (SandMafia) కోసం అడ్డుగా ఉన్న చెక్ డ్యామ్ ను కూల్చివేశారు. పెద్దపెల్లి జిల్లా (Peddapalli District) ఓదెల మండలం గుంపులలో 23 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ బాంబులు పెట్టి శనివారం ఉదయం పేల్చివేశారు.

మానేరు వాగు (Maneru Vagu) పై నిర్మిస్తున్న చెక్ డ్యామ్ వల్ల నీరు నిలిచి ఉండడంతో ఇసుక అక్రమ రవాణాకు వీలుపడటం లేదని భావించిన అక్రమార్కులు బాంబులు (Bombs) పెట్టి చెక్ డ్యామ్ ను పేల్చివేశారు. ఈ ఘటనలో మూడు ప్యానల్ లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిని విలువ మూడు కోట్లకు పైగా ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలియజేశారు. రూ.23కోట్లతో మానేరు వాగు (Maneru Vagu) పై నిర్మిస్తున్న చెక్ డాం పనులు పూర్తి కావడంతో అధికారులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసే సమయంలో ఇసుక అక్రమార్కులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ అధికారులతో పాటు పోలీసు అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

Leave a Reply