CPI FIRE  :  బూటకపు ఎన్ కౌంటర్లే AndhraPrabha News

CPI FIRE  :  బూటకపు ఎన్ కౌంటర్లే AndhraPrabha News

  • సిట్టింగ్​ జడ్జీతో  న్యాయ విచారణ జరిపించాలి
  • – సీపీఐ  జాతీయ కార్యదర్శి  కే రామకృష్ణ డిమాండ్

 ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు

 కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్​ కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో  న్యాయ విచారణ జరిపించాలని  సీపీఐ జాతీయ కార్యదర్శి  కే రామకృష్ణ ( CPI National Secreatary)  డిమాండ్ చేశారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ (Rama krishn) మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం  రామరాజ్యం పేరుతో  రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు.

ప్రతిరోజు నక్సలైట్లను దారుణంగా కాల్చి చంపటమే పనిగా పెట్టుకున్నారన్నారు. నక్సలైట్లు వద్ద పోలీసులు ఉన్నారని, పారా మిలిటరీ దళాలు ఉన్నాయని, ఆయుధాలు ఉన్నాయనే పేరుతో కేంద్ర బలగాలు (Central Forses)  అమాయకులైన గిరిజన ప్రజలను ఎన్​ కౌంటర్ల పేరుతో చంపటం ఎంతవరకు సబబు అన్నారు. తాము చర్చలకు సిద్ధమని ఒక పక్కా నక్సలైట్లు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం మానవ మారణ కాండను  కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిరిపుత్రులను (Tribes)  చర్చలకు పిలిచి సమస్యలపై  చర్చించి, వాటికి పరిష్కార మార్గం చూపాల్సిన కేంద్ర ప్రభుత్వం  అందుకు విరుద్ధంగా మారణ కాండను ( Assasination)  సృష్టిస్తుందన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు పూర్తిస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఒక హంతక ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. దీనిని ప్రజలు సహించడని, ప్రజాస్వామ్యవాదులంతా దీనిని ఖండించాలని పిలుపునిచ్చారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay) ఎన్​ కౌంటర్లు ఖండించే వారిపై కూడా కేసులు ఉంటాయని, తమ తదుపరి (Next target) టార్గెట్    అర్బన్ నక్సలైట్లని ( Urban Nixalites) పేర్కొనటం దుర్మార్గమన్నారు. నేడు నక్సలైట్లు, రేపు కమ్యూనిస్టులు, ఆ తర్వాత లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులపై కూడా కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం దాడులు జరిపే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యవాదులు తమ గళాన్ని మరింత విప్పాలని పిలుపునిచ్చారు. బూటకపు ఎన్​ కౌంటర్లపై (Fake Encouters)  సుప్రీం కోర్డు సిట్టింగ్ జడ్జితో (Sitting Judge)  న్యాయ విచారణ (Enquiry)  జరపాలని (demand) డిమాండ్ చేశారు. సమావేశంలో   సీపీఐ ఒంగోలు  జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఒంగోలు నగర కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసులు, ఇన్సాఫ్ రాష్ట్ర నాయకులు ఎంఏ సాలార్ తదితరులు పాల్గొన్నారు.