Temple | హేమాచలుడిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి

Temple | హేమాచలుడిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి

Temple | ములుగు జిల్లా, ఆంధ్రప్రభ : రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి(Sri Hemachala Lakshmi Narasimha Swamy)ని ఈ రోజు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ దర్శించుకున్నారు.

ఆలయాని(temple)కి విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ(Sarve Satyanarayana)కి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ(Mukkamala Rajasekhara Sharma), అర్చకులు కారంపూడి పవన కుమారాచార్యులు, ఈశ్వర్ చంద్ శర్మ, మురళీ కృష్ణ ఆచార్యులు తదితరులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు.

అనంతరం గర్భాలయంలో స్వామి వారికి సర్వే సత్యనారాయణ గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలు అందించి ఆశ్వీరవచనం చేశారు.