33 lakh crore | ఈపీఎఫ్ఓలోని పీఎఫ్ వెంటనే చెల్లించాలి

33 lakh crore | ఈపీఎఫ్ఓలోని పీఎఫ్ వెంటనే చెల్లించాలి

33 lakh crore | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికులతో ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(Beedi Workers Union) జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ పాల్గొన్నారు. బీడీ కార్మికుల ఆధార్ కార్డులో పేర్లు సరిగ్గా లేవని, అలాగే కార్మికుల వయసు సైతం మ్యాచ్ కావడం లేదని సర్ నేమ్(Sir Name) లేదని మెలిక పెట్టీ 33 లక్షల కోట్ల(33 lakh crore)  కార్మికుల పీఎఫ్ డబ్బులను నిలిపివేయడం సరికాదని అన్నారు.

వెంటనే కార్మికులకు పీ.ఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసమని 20% షేర్ మార్కెట్లో(20% share market) కేంద్ర ప్రభుత్వం పెడుతూ గతంలో ఉన్న సంక్షేమ పథకాలను రద్దు చేయడం చాలా దారుణమని మండిపడ్డారు. కార్మికులకు ఈపీఎఫ్ పెన్షన్(EPF pension) కేంద్ర ప్రభుత్వం పెంచి ఇస్తామని పెంచకుండా మోసం చేస్తున్నదని తీవ్రంగా వ్యతిరేకించారు.

కార్మికుల పెన్షన్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ప్రతినిధులు రాజు, అనిత, లక్ష్మి, నాగమణి, విజయ, రాజమణి, మమత, వసీమా, షబానా, రేష్మ, మైముదా, రజియా, పర్హాన, సల్మా, షాహిన్ బేగం బీడీ కార్మికులు పాల్గొన్నారు.