Jangaon | సమస్యల సాధన కోసం..

Jangaon | సమస్యల సాధన కోసం..

Jangaon, జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : జనగామ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుంటానని జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సీఎం (CM Revanth Reddy) రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందు ఉంటానని అన్నారు. ప్రజా ఆరోగ్యం, సాగు నీరు, విద్యా, పలు అభివృద్ధి అంశాలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఆస్పత్రిలో సిటి స్కాన్ ఏర్పాటుకు కృషి చేశాను అన్నారు.

నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యలు ప్రభుత్వ ప్రవేట్ ఆసుపత్రిలో పరిష్కారం కోసం కృషి చేయడం కాకుండా ప్రజలకు ఉచితంగా ఘట్కేసర్ లోని నీలిమ ఆసుపత్రిలో ఉచిత వైద్య సౌకర్యాలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోకలజమున లింగయ్య, కౌన్సిలర్ ప్రేమలత రెడ్డి, అనిత, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బాల్య సిద్ధులు, బైరగోని యాదగిరి గౌడ్, ఎండి సమ్మద్, తాళ్ల సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.