Achampet | చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

Achampet | చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
రూ. పది కోట్లతో స్టేడియం అభివృద్ధి
Achampet | అచ్చంపేట, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోనూ రాణించాలని, క్రీడల వల్ల శారీరక దృఢత్వంతోపాటు వ్యక్తిత్వ వికాసం చెందుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ (Vamsi Krishna) అన్నారు. ఈ రోజు అచ్చంపేట పట్టణంలో తొమ్మిదో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరై ఆటల పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. నల్లమల విద్యార్థులు (students) క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నాణ్యమైన విద్యతోపాటు క్రీడల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తుందని తెలిపారు. రానున్న సంవత్సర కాలంలో అచ్చంపేట పట్టణంలోని రాజీవ్ ఎన్టీఆర్ మినీ స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియాన్ని పది కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో ఆధునికీకరించి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ రామనాథం, మండల విద్యాధికారి జీవన్ కుమార్, పిడి నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

