SHIVA |శివనామస్మరణముతో..

SHIVA |శివనామస్మరణముతో..

SHIVA బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో దక్షిణ కాశీగా పేరు పొందిన సిద్ధిరామేశ్వర (Siddhi Rameshwaram) ఆలయంలో సోమవారం భక్తులు పోటెత్తారు. చివరి సోమవారాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో మూలభావి నీటితో తలస్నానాలు చేశారు. అనంతరం స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంలోని శివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి కోడే మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బందితో పాటు ఆలయ కమిటీ (Committee) పాలకవర్గ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం భక్తులు తులసి చెట్ల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. శివనామస్మరణముతో ఆలయం మారుమ్రోగింది.

Leave a Reply