WT 3.0 | స్టార్టప్‌లకు భారీ అవకాశాలు ..

WT 3.0 | స్టార్టప్‌లకు భారీ అవకాశాలు ..
- హై-ఇంపాక్ట్ స్టార్టప్-ఇన్వెస్టర్ మీట్…
- డీప్‌టెక్ ఇన్నోవేషన్‌కు వేదికగా వేల్ ట్యాంక్ WT 3.0
- 46 పెట్టుబడిదారుల హాజరు
- బయోటెక్–హెల్త్‌కేర్ రంగాల్లో ఇన్నోవేషన్‌కు హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్: ప్రముఖ స్టార్టప్ యాక్సిలరేటర్ వేల్ ట్యాంక్ (డబ్ల్యూటీ) బయోక్యాటలిస్ట్‌లు తమ మూడవ వార్షిక స్టార్టప్–ఇన్వెస్టర్ మీట్ డబ్ల్యూటీ 3.0 ను హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో విజయవంతంగా నిర్వహించారు. జాతీయ BioE³ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా, ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అడ్వైజరీ కౌన్సిల్ (BIRAC) వ్యూహాత్మక మద్దతుతో జరిగింది.
డబ్ల్యూటీ 3.0 ఈవెంట్ డీప్‌టెక్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్, ఫుడ్, అగ్రిటెక్ వంటి ముఖ్య రంగాల్లో డీప్‌టెక్ స్టార్టప్‌లకు నిధుల అవకాశాలను విస్తరించడం మీద దృష్టి పెట్టింది.
డబ్ల్యూటీ 1.0, డబ్ల్యూటీ 2.0 విజయాల ఆధారంగా.. గత రెండేళ్లలో 50కి పైగా పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో 100కుపైగా స్టార్టప్‌లకు ఫండింగ్‌ను సులభతరం చేసింది. ఈ ఏడాది ఎడిషన్ మరింత గొప్ప అవకాశాలను అందించింది. ప్రస్తుతం రెండు WT-ఇంక్యుబేటెడ్ ప్రాజెక్టులు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడుల దిశగా పురోగమిస్తున్నాయి.
వేల్ ట్యాంక్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ఉదయ్ సక్సేనా మాట్లాడుతూ… “డీప్ సైన్స్ ను వాణిజ్యంలోకి విజయవంతంగా అనువదించడానికి భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో డబ్ల్యూటీ ఈవెంట్ ఒక పరివర్తన వేదిక.” అని వ్యాఖ్యానించారు.
వేల్ ట్యాంక్ బయోక్యాటలిస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ మార్కండేయ గోరంట్ల మాట్లాడుతూ.. వేల్ ట్యాంక్ 3.0 భారతదేశ డీప్ టెక్ పర్యావరణ వ్యవస్థ నిజమైన బలాన్ని ప్రదర్శించిందని, 73కి పైగా షార్ట్ లిస్ట్ అయిన స్టార్టప్ లు, 46 మంది పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ వేదిక పై జరిగిన నెక్సాస్వీట్ ఉత్పత్తి లాంచ్ జాతీయ స్థాయి ప్రభావంతో ల్యాబ్ నుండి పరిశ్రమకు సృజనాత్మకత ఎలా మారుతుందో ప్రతిబింబిస్తుంది.”అని అన్నారు.
BIRAC–DBT కి చెందిన డాక్టర్ తరణ్జిత్ కౌర్ దేశ బయో–ఎకానమీ లక్ష్యాలను సాధించడంలో BioE³ మిషన్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
80 దరఖాస్తులలో, ప్రధాన పిచింగ్ సెషన్ కోసం 20 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. ఇంకా 50 స్టార్టప్‌లు పెట్టుబడిదారులతో నెట్‌వర్కింగ్ & ఎలివేటర్ పిచ్ సెషన్లకు అవకాశం పొందాయి.
వేల్ ట్యాంక్ నుండి ముఖ్య పెట్టుబడిదారులు, శ్రీ తారక్ ధుర్జతి, డాక్టర్ రత్నాకర్, డాక్టర్ విజయ్, డాక్టర్ రోలాండో, రాజేంద్ర చందక్, రాజేష్ మాగ్గు, డాక్టర్ జగదీష్ గండ్లా, డాక్టర్ సునీల్ కుర్చానియా, అనంత్ రెడ్డి……. బయోటెక్, ఫార్మా కంపెనీల సీఈఓలు, సీనియర్ మేనేజ్మెంట్ నిపుణులు, సీఐఐ చక్రవర్తి, లారస్ ల్యాబ్స్ కు చెందిన రాజారామ్ అయ్యర్…… ఇతర వెంచర్ క్యాపిటల్ సంస్థలతో పాటు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరించిన డిబిఎస్ బ్యాంక్ ప్రతినిధులు మొదలైనవారు కూడా పాల్గొన్నారు.
