Record |రహ్మత్‌నగర్ లో రికార్డు మెజారిటీ..

  • సి ఎన్ రెడ్డి డివిజన్ నుండి కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం

Record | జూబ్లీహిల్స్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్ సి ఎన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రహ్మత్‌నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజారిటీ లభించింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ సి ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. “జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనాలు. జూబ్లీహిల్స్ శాసనసభ్యులుగా 24,711 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన నవీన్‌ యాదవ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు” అన్నారు. అలాగే అన్ని డివిజన్లకన్నా అత్యధికమైన 6,025 మెజారిటీ అందించిన రహ్మత్‌నగర్ ప్రజలకు మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.

ఈ విజయంలో తమకు తోడుగా నిలిచిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి వివేక్‌, గౌరవ ఛైర్మెన్లు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply