Vajedu : మార్గమధ్యలోనే మ‌హిళ మృతి…

Vajedu : మార్గమధ్యలోనే మ‌హిళ మృతి…

వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన వాసం తులసి(45) అనే మహిళ జ్వరంతో మృతి చెందిన సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాల(Eturu Nagaram Government Hospital)కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ములుగు ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు.

అక్కడ కూడా ఆరోగ్యం నయం కాకపోవడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని అక్కడి వైద్యులు(Doctors) సూచించారు. ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లకుండా సొంత గ్రామానికి తీసుకువచ్చారు. ఆరోగ్యం విషమించడంతో వాజేడు ప్రభుత్వ వైద్యశాల(Vajedu Government Hospital)కు 108 సహాయంతో తరలిస్తుండగా మార్గమధ్యలోనే వాజేడు వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు.

Leave a Reply