అందెశ్రీ మరణం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి

అందెశ్రీ మరణం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి

వికారాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ ప్రజాగాయకుడు అందేశ్రీ అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

తెలంగాణ (Telangana) ఆవిర్భావంలో ఆయన రచనలు, గానం కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ సానుభూతి తెలిపారు.

Leave a Reply