కట్టుకున్న భార్యనే కిరాతకంగా..

మోతె (సూర్యాపేట జిల్లా): సూర్యాపేట జిల్లా విభలాపురం గ్రామంలో.. మద్యానికి బానిసైన ఓ భర్త చేసిన దాడిలో అతని భార్య దుర్మరణం పాలైన విషాద ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

విభలాపురం గ్రామానికి చెందిన షేక్ బండెల్లి (50) మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం నాడు బండెల్లి తన భార్య షేక్ కరీంబీ (45)ని మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, బండెల్లి కోపంతో ఊగిపోయాడు. ఆవేశంలో అతను కర్రతో కరీంబీపై దాడి చేశాడు.

ఈ దాడిలో కరీంబీ తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందింది అని వైద్యులు నిర్ధారించారు.

మృతురాలి కుమారుడు షేక్ నాగుల్ మీరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు, అనంతరం స్వగ్రామమైన విభలాపురానికి చేర్చినట్లు మోతె ఎస్సై అజయ్‌కుమార్ తెలిపారు.

Leave a Reply