వ్య‌క్తి దారుణ హ‌త్య‌

వ్య‌క్తి దారుణ హ‌త్య‌

తిర్యాణి, ఆంధ్రప్రభ : చేత‌బ‌డి నెపంతో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడిచేసి దారుణంగా హతమార్చిన సంఘటన తిర్యాణి మండలంలోని పిట్టగూడ గ్రామంలో చోటు చేసుకుంది. మండలం లోని మంగి గ్రామ పంచాయతీ(Mangi Gram Panchayat) పరిధిలోని పట్టగూడ గ్రామానికి చెందిన హనుమంతరావు (50)తన కుటుంబ సభ్యులకు చేత‌బ‌డి చేస్తున్నారనే అనుమానంతో నిన్న‌ రాత్రి అదే గ్రామానికి చెందిన సీడాం వినోద్ గొడవ పడి.. గొడ్డలితో దాడి చేశాడు.

ఇది గమనించి భార్య ఊర్వేత బొజ్జ బాయి(Urveta Bojja Bai అడ్డుకునేందుకు వెళ్లగా ఆమె పై దాడికి యత్నించగా ఆమె తప్పించుకొని ఇంట్లోకి వెళ్లి గొళ్ళెం పెట్టుకుంది. స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ దాడిలో హ‌నుమంత‌రావు(Hanumantha Rao) అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయి ప్రాణాలు వీడాడు.