తుఫాను బాధితులను ఆదుకోవాలి..

తుఫాను బాధితులను ఆదుకోవాలి..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను సృష్టించిన భీభత్సం వలన రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, తుఫాను బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో మొంథా తుఫాను రాష్ట్రంలోని పలు జిల్లాలలో విలయతాండవం సృష్టించిందని, గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, గాలుల తీవ్రత కారణంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో(15 lakh acres) పంటనష్టం జరిగిందన్నారు.

అప్పులు చేసి పంటలు సాగుచేసిన రైతాంగానికి సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందన్నారు. వరితో పాటు పత్తి, మొక్కజొన్న(cultivating maize.), మినుము, వేరుశనగ, కొబ్బరి, అరటి, టమోటా, ఉద్యానవన, ఆక్వా పంటలకు తీవ్ర నష్టం కలిగిందని, లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని.. పలుచోట్ల ఇళ్లు కూలి నిరాశ్రయులయ్యారని, పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి, మత్య్సకారుల వెతలు వర్ణనాతీతం అన్నారు.

రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లోని 87 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, 59 వేలకు పైగా హెక్టార్లలో వరి పంట నీట మునగగా, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా 42 పశువులు(42 cattle) చనిపోగా, పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు, 2,294 కి.మీ. పొడవున ఆర్ బి రహదారులు ధ్వంసమై రూ.1,424 కోట్లు నష్టం జరిగిందన్నారు.

రూరల్ వాటర్ సప్లయ్ కు సంబంధించి రూ.36 కోట్లు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జరిగిన నష్టాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఎన్యూమరేషన్(enumeration) చేయాలన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని, తుఫాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరానికి రూ.25(Rs. 25 per acre) వేల నుంచి రూ. 50 వేల రూపాయల వరకు రైతాంగానికి సహాయం అందించి, ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మొంథా తుఫాను వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించి, కేంద్రం నుండి తుఫాను సహాయక నిధులు రాబట్టేందుకు కృషి చేయాలన్నారు.

Leave a Reply