కేంద్ర ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి

కేంద్ర ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి

కరీంనగర్ , ఆంధ్రప్రభ : క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు కేంద్ర పథకాల అమలు పై తనిఖీలు(Inspections) చేసి చర్యలు తీసుకోవాలని, కేంద్రం ఇస్తున్న నిధులు, ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం లో ఆయ‌న‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

కరీంనగర్ కార్పొరేషన్(Karimnagar Corporation) లో ఎంపీ లాడ్స్ గ్రౌండ్ కావడంలో జాప్యమేల అని నిలదీశారు. ఎంసీకే అధికారుల నిర్లక్ష్యం సహించరానిది, కమిషనర్ ఇకపై అమృత‌ స్కీం పూర్తి పర్యవేక్షణ, బాధ్యత క‌లెక్ట‌ర్ల‌దే అని సూచించారు. గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాక కట్టెల పొయ్యిపై ఎందుకు వండుతున్నారు ప్ర‌శ్నించారు.

ఆర్ అండ్ బి పనులు నత్తనడకన జ‌రుగుతుంటే ఏమి చేస్తున్నార‌ని అధికారుల‌ను బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు. కాంట్రాక్టర్లంతా సిండికేట్ అయ్యి ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తున్నారని నిల‌దీశారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం ఇంకెంత కాలం జరుగుతుంద‌ని మండిప‌డ్డారు.
జనం అల్లాడుతున్నా మీరు ఎందుకు ప‌ట్టించుకోవం లేద‌ని ఆగ్రహం వ్యక్తంచేశారు.

గన్నేరువరం(Gunneruvaram) నుండి బెజ్జంకి రోడ్డు పనుల్లో తీవ్ర నిరక్ష్యం క‌నిపిస్తుంద‌ని, ఎందుకు తనిఖీలు చేయడం లేదన్నారు. ఆసుపత్రుల నిధులన్నీ దాదాపుగా కేంద్రమే ఇస్తోంద‌ని, అయినా ఆశించిన ఫ‌లితం క‌నిపించ‌డం లేద‌ని బండి అన్నారు. సిరిసిల్ల జిల్లాలో ప్రజలకు మరింతగా వైద్య సేవలను అందుబాటులో ఉంచాల‌న్నారు.

మెడిసిన్స్(Medicines) కూడా ఇవ్వకపోతే ప్రజలు బాధ పడుతున్నార‌న్నారు. మెడిసిన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేద‌ని, మెడిసిన్స్ ఇవ్వకపోతే ప్రజలెందుకు వస్తారన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారులు ట్రీట్ మెంట్ తీసుకుంటే సామాన్యులకు భరోసా వస్తుందన్నారు.

Leave a Reply