లగ్జరీ బస్సు బీభత్సం.

  • ములుగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
  • ఇద్దరు కార్మికుల మృతి

ములుగు, (ఆంధ్రప్రభ): జిల్లాలోని ములుగు రాజీవ్ రహదారి పై విషాదం చోటుచేసుకుంది. ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌పై గడ్డి తొలగించే పనుల్లో నిమగ్నమైన కార్మికులను ఒక లగ్జరీ బస్సు వేగంగా దూసుకెళ్లి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.