ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి కూడా..

ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి కూడా..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ (hyderabad)లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పద్మానగర్‌లో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను చంపి ఆత్మహత్యకు పాల్పడింది.

సాయిలక్ష్మి (Sailakshmi) అనే మహిళ తన రెండేళ్ల కవల పిల్లలకు గొంతు నులిమి ప్రాణాలు తీశాక, మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సాయిలక్ష్మి స్వస్థలం ఏలూరు (eluru) జిల్లా నూజివీడు. భర్త అనిల్‌కుమార్‌తో గొడవలే ఈ ఘోర ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply